: తెలంగాణ నిర్ణయంపై ఎలాంటి సవరణ లేదు: పీసీ చాకో
విభజన విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం పునః పరిశీలిస్తుందంటూ సీమాంధ్ర నేతలు చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని ఎంపీ పీసీ చాకో తెలిపారు. ప్రస్తుత సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ కు ఓ విధానముందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని, ఇరు ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని ఆయన చెప్పారు. ఉద్యమాల ఒత్తిడి వల్లనే సీమాంధ్ర నేతలు రాజీనామాలకు సిద్ధపడి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.