: తెలంగాణ నోట్ కేబినెట్ కమిటీ ముందుకు వస్తుంది: మనీష్ తివారీ
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ఎలాంటి జాప్యంలేదని కేంద్ర మంత్రి మనీష్ తివారీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నోట్ త్వరలో రాజకీయ ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జరుగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలపై తెలంగాణ ప్రభావం పడదని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ఆగిపోయిందన్న వాదనల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని మనీష్ తివారీ స్పష్టం చేశారు. కేబినెట్ నోట్ తయారైందని, రాజకీయ ఆమోదం పొందడమే తరువాయని ఆయన తెలిపారు.