: సీమాంధ్ర మంత్రులను అడ్డుకున్న సచివాలయ ఉద్యోగులు
సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం నుంచి బయటకు వచ్చిన సీమాంధ్ర మంత్రులను సచివాలయ ఉద్యోగులు అడ్డుకున్నారు. రాజీనామాలు చేసి మంత్రివర్గ సమావేశానికి ఎలా హాజరవుతారని వారు మంత్రులను ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా అంటే అన్ని కార్యక్రమాల నుంచి విరామం తీసుకోవాలని వారు సూచించారు.