: సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై చర్చించనున్నట్లు సమాచారం. విభజన ప్రకటన నేపథ్యంలో సీమాంధ్రలో 52 రోజుల నుంచి కొనసాగుతున్న సమ్మె, నిరసనలు.. మరోవైపు తెలంగాణ నోట్ ను పరిశీలిస్తామని షిండే ప్రకటన, ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చేదాకా విభజనపై ముందుకు వెళ్లబోమని దిగ్విజయ్ సింగ్ చెబుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.