: బడ్జెట్-2013 రేపే
అందర్నీ ఉత్కంఠకు గురిచేస్తున్న బడ్జెట్-2013ను రేపు ఆర్దిక మంత్రి చిదంబరం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి పలు కోతలు-వాతలు తప్పవని ఆర్థికరంగ నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా ఆర్ధిక పురోభివృద్ధి, పన్ను సంస్కరణలపైనే చిదంబరం దృష్టిపెట్టే అవకాశం ఉంది.
వ్యవసాయ రంగానికి కీలకమైన ఎరువుల ధరలపై మంత్రి ఎలాంటి నిర్ణయం వెలిబుచ్చుతారోనని రైతు వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మరోవైపు పక్కలో బల్లెంలా చైనా నానాటికీ బలపడుతున్న నేపథ్యంలో రక్షణ రంగానికి భారీ నిధులు కేటాయించే అవకాశాలున్నాయి.
ఇక ప్రభుత్వాలకు భారీ ఆదాయం సమకూర్చే ఎక్సైజ్ సుంకాలను పెంచేందుకు చిదంబరం ఇప్పటికే కసరత్తు చేశారని తెలుస్తోంది. ఏదేమైనా, బడ్జెట్-2013 తీరుతెన్నులు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.