: భారత్ తో సిరీస్ కు 'కంగారూ' జట్టు ఇదే..


భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వచ్చే నెలలో ఏడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. భారత్ ఆతిథ్యమివ్వనున్న ఈ సిరీస్ లో పాల్గొనే ఆసీస్ జట్టును ప్రకటించారు. ఫిట్ నెస్ సమస్యలతో సతమతమవుతున్నా.. క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్టర్లు కెప్టెన్ గా మైకేల్ క్లార్క్ వైపే మొగ్గుచూపారు. డేవిడ్ బెయిలీ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. కాగా, భారత్, ఆసీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు జరగనుంది. అంతకుముందు ఇరుజట్లు అక్టోబర్ 10న ఏకైక టి20 మ్యాచ్ లో తలపడతాయి. ఆసీస్ జట్టు వివరాలు.. క్లార్క్ (కెప్టెన్), బెయిలీ (వైస్ కెప్టెన్), షేన్ వాట్సన్, ఆరోన్ ఫించ్, ఫిల్ హ్యూస్, ఆడమ్ వోగ్స్, బ్రాడ్ హడిన్ (వికెట్ కీపర్), మోజెస్ హెన్రిక్స్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మిచెల్ జాన్సన్, జేమ్స్ ఫాక్నర్, నాథన్ కౌల్టర్ నైల్, క్లింట్ మెకాయ్, డోహార్టీ.

  • Loading...

More Telugu News