: ఎంపీలు రాజీనామా చేస్తే విభజన ఆగిపోతుంది: టీడీపీ
సీమాంధ్రలో ఉన్న 21 మంది ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కుప్పకూలుతుంది లేదా విభజన ప్రకటన ఆగుతుందని టీడీపీ నేత, మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా ఏడురోడ్ల కూడలిలో రిలే నిరాహార దీక్షలో కూర్చున్న ఆయన మాట్లాడుతూ, అప్పట్లో వాజ్ పేయి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తే.. 38 మంది ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చంద్రబాబు హెచ్చరించారని, దీంతో ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని తెలిపారు. రాజీనామాలకు మంత్రులు నిరాకరిస్తే తెలుగుజాతి ఊరుకోదని అన్నారు.