: హైదరాబాద్ టెస్టుకు పటిష్ట భద్రత
జంట పేలుళ్ల నేపథ్యంలో మార్చి 2 నుంచి 6 వరకు హైదరాబాద్ లో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్టుకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. వెయ్యి మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు కల్పిస్తామని సైబారాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు.
1100 మంది పోలీసులు, 250 మంది ప్రత్యేక భద్రత సిబ్బంది, 270 మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లను నియమిస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. కాగా, మ్యాచ్ సందర్బంగా ప్రేక్షకులు సెల్ ఫోన్లను, బ్యాగులను స్టేడియంలోకి తీసుకురాకూడదని స్పష్టం చేశారు. స్టేడియం చుట్టుపక్కల సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని కమిషనర్ చెప్పారు.