: ఉద్యోగులకు జవాబుదారీతనం అవసరం: హైకోర్టు


ఉద్యోగులు ఉన్నది ప్రజాసేవ కోసమేనని, వారికి జవాబుదారీతనం అవసరమని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. ఏపీఎన్జీవోల సమ్మెపై దాఖలైన పిల్ పై కాసేపటి క్రితం హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగులు ప్రజలకోసమే పనిచేయాలని, ప్రజాసమస్యలపై ఏ వ్యవస్థ కూడా స్పందించనప్పుడు జోక్యం చేసుకునే అధికారం న్యాయవ్యవస్థకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News