: ట్విట్టర్ ఖాతా తెరిచిన టీడీపీ అధినేత
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక సోషల్ మీడియాలోనూ తన వాణిని వినిపించేందుకు సై అంటున్నారు. ఈమేరకు ఆయన బుధవారం ట్విట్టర్లో ఖాతా తెరిచారు. 'టెక్నాలజీకి థ్యాంక్స్' అంటూ తొలి ట్వీట్ చేశారు. 'యూపీఏ అవినీతి కేన్సర్ లా ఉద్యోగాలను తినేస్తోంది, యాక్షన్ తీసుకోండి' అంటూ మరో ట్వీట్ వదిలారు. కాగా, చంద్రబాబు తనయుడు లోకేశ్ ఎప్పటినుంచో ట్విట్టర్లో క్రియాశీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. దేశ రాజకీయ రంగంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడల్లా లోకేశ్ ట్విట్టర్లో తన స్పందనను పంచుకుంటున్నారు.