: బీసీసీఐ మాజీ సెక్రెటరీ మృతి


బీసీసీఐ మాజీ సెక్రెటరీ జయంత్ యశ్వంత్ లెలే కన్నుమూశారు. గుజరాత్ లోని వడోదరాలో తన నివాసంలో గతరాత్రి తీవ్ర గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. 75 సంవత్సరాల లెలేకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భారత క్రికెట్ బోర్డుకు మొదట అసిస్టెంట్ సెక్రెటరీగా చేసిన ఆయన 1996లో సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో క్రికెట్ బోర్డుకు ప్రెసిడెంట్ గా జగ్మోహన్ దాల్మియా ఉన్నారు. అయితే, లెలే బోర్డు సెక్రెటరీగా ఉన్న సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ బయటికొచ్చింది. 2000లో వెలుగు చూసిన స్కాంలో అప్పటి కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్, అజయ్ శర్మలపై బోర్డు జీవితకాల నిషేధం విధించగా.. అజయ్ జడేజా, మనోజ్ ప్రభాకర్ లను ఐదు సంవత్సరాల పాటు సస్పెండ్ చేశారు. కాగా, లెలే సెప్టెంబర్ 13న జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం కొద్దిరోజులకే ఆయన కన్నుమూయడం విచారకరం.

  • Loading...

More Telugu News