: చైనా, జపాన్ లో భూకంపం


ఈ రోజు తెల్లవారుజామున చైనా, జపాన్ లను భూకంపం వణికించింది. జపాన్ లోని ఫుకుషిమా ప్రాంతంలో తెల్లవారుజామున 2.25 గంటలకు భూకంపం సంభవించిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8 గా నమోదు అయింది. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని తెలిపింది.

అలాగే చైనాలో తెల్లవారుజామున 5.37 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1 గా నమోదయిందని అధికారులు తెలిపారు. చైనాలోని సుసాన్ కౌంటీ, గన్స్ ప్రావిన్స్, మెన్ యన్ కౌంటీ, క్వింగ్ హై ప్రావిన్స్ లలో ప్రకంపనలు వచ్చాయి.

  • Loading...

More Telugu News