: మీ కంప్యూటర్లు భద్రం


నిన్నటికి నిన్న స్మార్ట్‌ ఫోన్లలోకి చొరబడి మనకు తెలియకుండానే... మన ప్రమేయం లేకుండానే ఫోన్‌కాల్స్‌, మెసేజ్ లు పంపించేసే వైరస్‌ వ్యాపిస్తోందని పరిశోధకులు హెచ్చరించారు. ఇప్పుడు కంప్యూటర్లలోకి చొరబడిపోయే మరో కొత్తరకం వైరస్‌ను నేరగాళ్లు సృష్టించారని, ఇది మీ కంప్యూటర్లలోకి చొరబడిపోయి అందులోని ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించేస్తుందని, మీ కంప్యూటర్లను నిర్వీర్యం చేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆర్ధిక సంస్థలే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు ఒక కొత్తరకం వైరస్‌ను సృష్టించి వదిలారట. ఈ వైరస్‌పేరు మాల్‌వేర్‌. పేరుకు తగ్గట్టుగా ఈ వైరస్‌ ఆర్ధిక సంస్థలు, ఆన్‌లైన్‌ చెల్లింపు వేదికలు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్లపైకి దాడికి పాల్పడుతోందట. మీ కంప్యూటర్లలో ఇప్పటికే ఉన్న యాంటీ వైరస్‌ ప్రోగ్రాములను నిర్వీర్యం చేయడం ద్వారా ఇది దాడిని కొనసాగిస్తుందట. ఆన్‌లైన్‌ వీడియో ఛాటింగ్‌ సైట్‌ స్కైప్‌ ద్వారా ఇది కంప్యూటర్లలోకి వ్యాపిస్తోందని ఎఫ్‌బీఐ హెచ్చరిస్తోంది.

  • Loading...

More Telugu News