: కార్యకర్తపై లైంగిక వేధింపులకు పాల్పడిన డీఎంకే నేత


స్వంత పార్టీకి చెందిన కార్యకర్తపై లైంగిక వేధింపులకు పాల్పడిన డీఎంకే సీనియర్ నేతపై తిరునల్వేలి పోలీసులు కేసు నమోదు చేశారు. తిరునల్వేలి డీఐజీ కథనం ప్రకారం.. డీఎంకే సీనియర్ లీడర్ వి.కుప్పుసామి పాండియన్ పార్టీలో పదవి కావాలంటే తనతో గడపాలంటూ లైంగికంగా వేధించాడని ఓ 30 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. గతంలో తాను ఫిర్యాదు చేసినా పాండియన్ తన పలుకుబడితో అడ్డుకున్నాడని కూడా ఆమె ఆరోపించింది. దీంతో పాండియన్ పై పలు సెక్షన్లక్రింద కేసు నమోదు చేశారు. అయితే తాను అమాయకుడినని తనకేపాపం తెలియదని పాండియన్ అంటున్నారు.

ఇదంతా డీఎంకే సస్పెండెడ్ ఎమ్మెల్యే ఎన్ మలైరాజా పన్నాగమని పాండియన్ వర్గం ఆరోపిస్తోంది. మలైరాజా మాత్రం ఆమె ఎవరో అనామక మహిళ కాదని, డీఎంకే పార్టీకి వారి తాతల నుంచి సేవ చేశారని, అలాంటి ఆమె తప్పుడు ఫిర్యాదు చేయదని అంటున్నారు. అందుకే తాను ఆమెకు మద్దతుగా నిలుస్తానని చెబుతున్నారు. ఆమె ఫిర్యాదు తప్పని రుజువు చేయాల్సింది పాండియన్ అని కూడా మలైరాజా సూచిస్తున్నారు. పాండియన్ ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News