: 'హెలి'స్కాంపై జేపీసీని ప్రకటించిన ఆంటోనీ.. ఏకాకి అయిన బీజేపీ
ప్రముఖులకు ఉపయోగించే ‘అగస్టా వెస్టులాండ్’
హెలికాప్టర్ల కుంభకోణంపై జేపీసీ ఏర్పాటు చేసి, అందుకు కారకులైన వారిని
శిక్షిస్తామని రాజ్యసభలో ఈ రోజు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ హామీ ఇచ్చారు.
ఇందులో రాజ్యసభకు చెందిన 20 మంది ఎంపీలు ఉంటారని తెలిపారు. అయితే
ముందు నుంచీ ఈ అంశంలో సీబీఐ చేతే దర్యాప్తు చేయించాలని బీజేపీ పట్టబట్టినా యూపీఏ ససేమిరా అంది.
చివరికి సభలో ములాయం సింగ్, బీఎస్పీ, సీపీఐలు సర్కారుకు మద్దతు తెలపడంతో జేపీసీనే ప్రకటించింది. దాంతో, ఈ విషయంలో బీజేపీ ఒంటరిదైంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, బీజేపీ సంకీర్ణంలోని ప్రధాన పార్టీ శివసేన కూడా జేపీసీకే ఓటు వేసింది. కానీ, బీజేపీ మాత్రం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సీబీఐ దర్యాప్తునే డిమాండు చేస్తోంది. ఎందుకంటే, వచ్చే సాధారణ ఎన్నికల లోపు, జేపీసీ దర్యాప్తు పూర్తి కాదని బీజేపీ వాదిస్తోంది. అప్పటివరకూ వారు వ్యవహారాన్ని సాగదీస్తూ ఎక్కువ సమయం తీసుకుంటారని బీజేపీ భావిస్తోంది.