: లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ చీలిపోతుంది: రాందేవ్ బాబా


రానున్న లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ ముక్కలు చెక్కలవుతుందని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. లక్నోలో ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయ జ్యోతిష్యాన్ని చెబుతున్నానని, రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో ముక్కలవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 100 సీట్లను మాత్రమే నెగ్గి ప్రతిపక్షంలో కూర్చుంటే, ఎన్డీయే 300 సీట్లతో విజయఢంకా మోగిస్తుందని తెలిపారు. ఆ తరువాత పార్టీని రాహుల్ గాంధీ నడపలేకపోవడంతో కాంగ్రెస్ చీలిపోతుందని వివరించారు.

  • Loading...

More Telugu News