: సచిన్ కోసం కప్పు కొడతాం: రోహిత్
ఛాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ టైటిల్ ను సచిన్ కోసం సాధిస్తామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. జైపూర్ లో రోహిత్ మాట్లాడుతూ.. సచిన్ ఆడే చివరి టి20 లీగ్ ఇదేనని, అందుచేత అందరం సమష్టిగా ఆడి సీనియర్ ఆటగాడికి టైటిల్ కానుకగా అందజేస్తామన్నాడు. కాగా, ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ తో శనివారం తలపడనుంది.