: మహిళా ఫోటో జర్నలిస్టు అత్యాచార కేసులో ఛార్జిషీట్ దాఖలు
గతనెల ముంబయిలో ఓ మహిళా ఫోటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచార కేసులో ముంబయి పోలీసులు జువనైల్ కోర్టులో ఛార్జిషీటును దాఖలు చేశారు. కాగా, ఇదే కాపీని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సెషన్స్ కోర్టుకు సమర్పించనున్నారు. ఇందులో ఐదుగురు నిందితులకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయని సమాచారం. అయితే, ఈ ఐదుగురు నిందితులు మైనర్లేనని మరోవైపు ఓ వాదన ఉంది. దీంతో, వారి డీఎన్ఏ ల ఆధారంగా పోలీసులు విచారణ జరపనున్నారు.