: రాగల 48 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.