: దిలీప్ కుమార్ కు విశ్రాంతి అవసరం: భార్య సైరాభాను
అస్వస్థత కారణంగా నాలుగు రోజుల కిందట ముంబయి లీలావతి ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ క్రమంగా ఐసీయూలో కోలుకుంటున్నారని ఆయన భార్య సైరాభాను తెలిపారు. ఈ సమయంలో ఆయనకు చాలా విశ్రాంతి అవసరమని తెలిపారు. ఈ ఉదయం లేచి టీ తాగారని చెప్పారు. దిలీప్ కుమార్ కోలుకోవాలని ప్రార్ధించిన అభిమానులకు, స్నేహితులకు, అందరికీ కృతజ్ఞతలని సైరా తెలిపారు. ఎప్పుడూ తమ అభిమానాన్ని, ప్రేమను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.