: స్టింగ్ ఆపరేషన్లు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు: అజాం ఖాన్
ముజఫర్ నగర్ అల్లర్లపై చేపట్టిన దర్యాప్తును నెమ్మదిగా చేయాలని ఆదేశించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీ మంత్రి అజాం ఖాన్... ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో మంత్రి గారి వంకర బుద్ధి వెల్లడయింది. అయితే, తన పరువును, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే సదరు టీవీ ఛానల్ ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. తాను నీతి, నిజాయతీతో బతుకుతున్నానని... ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ముజఫర్ నగర్ ఘర్షణలకు కారణమైన వారిని కాపాడే ప్రయత్నం చేయడంలేదని తెలిపారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అజాం ఖాన్ అన్నారు. అంతే కాకుండా, ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే స్టింగ్ ఆపరేషన్లు మంచివి కావని అభిప్రాయపడ్డారు.