: 'కార్నిజీ' బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో రతన్ టాటా
అమెరికాకు చెందిన 'కార్నిజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ' మెంబర్ గా... ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కార్నిజీ చైర్మన్ హార్వే ఫైన్ బర్గ్ మాట్లాడుతూ... రతన్ టాటా తమ సంస్థలో చేరడం ఆనందదాయకమని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పట్ల టాటాకు మంచి అవగాహన ఉందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న దేశంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబిచ్చారు. టాటాకు ఉన్న అపార అనుభవం తమ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని హార్వే ఆశాభావం వ్యక్తం చేశారు.