: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి
శ్రీకాకుళం జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న నిరసనలు 51వ రోజుకు చేరుకున్నాయి. జేఏసీలతో పాటు విద్యార్థులు, మహిళలు కూడా ఉద్యమంలో భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఏపీఎన్జీవోలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు శ్రీకాకుళం పట్టణంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను సమైక్యవాదులు ముట్టడించారు. బ్యాంకులు, బీఎస్ ఎన్ ఎల్, రైల్వే రిజర్వేషన్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లాలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. నగరలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను విద్యార్థి ఐకాస నేతలు ముట్టడించారు. బీఎస్ ఎన్ ఎల్, పోస్టల్ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు.