: ముగ్గురు పాక్ ఎయిర్ హోస్టెస్ లు అరెస్టు
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ పీఐఏకు చెందిన ముగ్గురు ఎయిర్ హోస్టెస్ లను బ్రిటన్ పోలీసులు అరెస్టు చేశారు. బ్రిటన్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకే వారిని అరెస్టు చేసినట్లు పాక్ ఉన్నతాధికారులు తెలిపారు. మాంచెస్టర్ లోని ఓ హోటల్ లో వారిని అదుపులోకి తీసుకున్న బ్రిటన్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే, వారిని ఎందుకు అరెస్టు చేశారనే విషయంపై తమకు సమాచారం లేదని, బ్రిటన్ తో చర్చిస్తున్నామని పాక్ తెలిపింది.