: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్ కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2.2 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. జలాశయంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో... అధికారులు 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తేశారు. ఈ ఏడాదిలో శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడం ఇది రెండో సారి కావడం విశేషం.
అలాగే తుంగభద్ర రిజర్వాయర్ కు కూడా వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తేశారు. ఇదే విధంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు కూడా జల కళ వచ్చింది. దీనిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో... 24 గేట్లను ఎత్తి 2.2 క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు.