: తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్ వినాయకుడు
ఖైరతాబాద్ గోనాగ చతుర్ముఖ వినాయకుడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. 59 అడుగుల ఎత్తైన గణనాథుని కనులారా వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రస్తుతం తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గరకు చేరుకుంది. నిన్న అర్థరాత్రి 2 గంటలకు స్వామివారి యాత్ర ప్రారంభమైంది.