: 80 ఓవర్ల తర్వాత మరో రెండు రివ్యూలు!
టెస్టుల్లో అంపైర్ నిర్ణయాల్లో మరింత పారదర్శకతను తెచ్చేందుకు ఐసీసీ నడుంబిగించింది! ఐసీసీ తాజా నిర్ణయం ప్రకారం అంపైర్ నిర్ణయ సమీక్ష (డీఆఎస్) అనుసరిస్తున్న జట్లు ఇప్పటికే ఉన్న రెండు రివ్యూలకు అదనంగా మరో రెండు రివ్యూలు కొరవచ్చు. ఐతే ఈ అదనపు రివ్యూలు ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లు ముగిశాక మాత్రమే కోరాలి అనేది షరతు. ఈ కొత్త విధానం ప్రయోగాత్మకంగా అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని ఐసీసీ బుధవారం ప్రకటించింది. దీనర్థం నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే యాషెస్‌లో ఈ విధానం తొలిసారిగా అమలుకానుందన్నమాట. ఇటీవల యాషెస్ సిరీస్‌లో డీఆర్‌ఎస్ వివాదాస్పదమైన నేపథ్యంలో ఐసీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.