: నేరచరిత మంత్రుల న్యాయమే గీతారెడ్డికీ వర్తింపజేయాలి: మోత్కుపల్లి
గతంలో కళంకిత మంత్రులకు అనుసరించిన విధానమే గీతారెడ్డికి కూడా వర్తింపజేయండి అని గవర్నర్ ను కలిసిన టీడీపీ నేత మోత్కుపల్లి నర్శింహులు డిమాండ్ చేశారు. గవర్నర్ ను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. సీబీఐ దాఖలు చేసిన 10 చార్జిషీట్లలో జగన్ పై అభియోగాలు నమోదయ్యాయని ఆయన గుర్తుచేశారు. గీతారెడ్డి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ సంపాదించిన అక్రమాస్తులను తక్షణం స్వాధీనం చేసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులను రక్షించాలని ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి కూడా నేరస్తుడేనని ఆయన అన్నారు.