: తేనెటీగ విషంతో హెచ్ఐవీ ఖతం


తేనెటీగ పేరులోనే గమ్మత్తు ఉంటుంది. తొలి రెండక్షరాలు అమృతాన్ని పంచితే చివరి రెండక్షరాలు ప్రమాదాన్ని గుర్తుచేస్తాయి. అయినప్పటికీ తేనెటీగలంటే ఆరోగ్యాన్నిస్తాయని కాస్త అభిమానం. ఇప్పుడు తేనెటీగలు మనుషులకు మరింత ఉపయోగకారులుగా మారాయి. తేనెటీగ విషంతో ఏకంగా హెచ్ఐవీని అంతమొందించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే పరిశోధనల స్థాయిని దాటిన ఈ ఔషధం తాజాగా తయారీ వరకూ వచ్చింది. తేనెటీగ విషంలోని మెలిటిన్ పదార్థంతో హెచ్ఐవీ నిర్మూలన ఔషధాన్ని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు.

హైచ్ఐవీ సోకకుండా నివారించే జెల్ తో పాటు మందు కూడా మెలిటిన్ తో తయారు చేయవచ్చట. ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే శరీర కణాలకు హాని చేసే మెలిటిన్ ను అత్యంత సూక్ష్మ పరిమాణంలో నానో పార్టికల్స్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడితే హెచ్ఐవీ కణాలకు అతుక్కుని వాటి చుట్టూ ఉండే రక్షణ కవచాలకు తూట్లు పొడుస్తుందట. దీంతో రక్షణ కవచాన్ని తిరిగి ఉత్పత్తి చేసుకోలేక హెచ్ఐవీ అంతమైపోతుందట.

  • Loading...

More Telugu News