: విద్వేష పూరిత వ్యాఖ్యల కేసు్లో వరుణ్ గాంధీకి ఊరట
విద్వేష పూరిత ప్రసంగం కేసుల్లోని ఒకదానిలో బీజేపీ నేత వరుణ్ గాంధీకి ఊరట లభించింది. ఉత్తరప్రదేశ్ లోని స్థానిక కోర్టు వరుణ్ ని నిర్ధోషిగా ప్రకటించింది. కాగా, మరో కేసుపై తీర్పును న్యాయస్థానం శుక్రవారం వెలువరించనుంది. 2009 జాతీయ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని పిలిబ్బిత్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వరుణ్ ప్రసంగించారు.
ఇందులో ఆయన వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చటొగొట్టే విధంగా ఉన్నాయని యూపీలో రెండుచోట్ల కేసులు నమోదయ్యాయి. కేసులో భాగంగా 51 మంది సాక్ష్యులను ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ విచారించింది. అయితే ఎవరూ సరైన సాక్ష్యాన్ని ఇవ్వలేదు. ఈ వ్యాఖ్యలు సంచలనం రేగడంతో వరుణ్ 19 రోజులు జైలులో ఉన్నారు. అయినా పిలిబ్బిత్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.