: ఏడాదిలో 96సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్
భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో వాస్తవాధీనరేఖ వద్ద ఈ ఏడాదిలో ఇప్పటివరకు పాకిస్థాన్ 96 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. అందులో ఒక్క సెప్టెంబర్ నెలలో 18 సార్లు కాల్పులు జరిగినట్లు డిఫెన్స్ అధికార ప్రతినిధి ఎస్ఎన్ ఆచార్య తెలిపారు. ప్రధానంగా ఆగస్టు 6 నుంచి భారత్ సరిహద్దు వద్ద, జమ్మూకాశ్మీర్ వాస్తవాధీన రేఖ వద్ద పాక్ సైన్యం పలుమార్లు కాల్పులు జరిపింది. ఈ క్రమంలో ఆరుగురు ఆర్మీ జవాన్లు, పద్నాలుగు మంది సరిహద్దు భద్రత సిబ్బందిని పాక్ సైన్యాలు పొట్టనబెట్టుకున్నాయి. ఇక గత సంవత్సరంలో 93 సార్లు పాక్ కాల్పులు జరపగా, 13 మంది మరణిస్తే అందులో ముగ్గురు సరిహద్దు భద్రత సిబ్బంది, పదిమంది ఇతరులు వున్నారు.