: జార్ఖండ్ ఎమ్మెల్యేల్లో సగం మంది క్రిమినల్సే!


నేరాల గురించి ఆలోచిస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలే. పేదరికం, నిరక్షరాస్యతే అక్కడి నేరాలకు కారణమనేది రొటీన్ డైలాగ్. అయితే, చట్టాలు చేసే స్థానంలో ఉన్నవారు కూడా సగం మంది నేరచరితులేనని సాక్షాత్తు జార్ఖండ్ ప్రభుత్వం తెలిపింది. హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలకు గాను 40 మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వీరిలో 20 మంది తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారట. వీరికి పదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉందట. 'ఇండియా అగైనెస్ట్ కరప్షన్' అనే సంస్థకు చెందిన రాజీవ్ కుమార్ అనే న్యాయవాది మొత్తం 59 శాసనసభ్యులపై కేసులున్నట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సమాధానంగా ప్రభుత్వం ఈ వివరాలను తెలిపింది.

  • Loading...

More Telugu News