: జగన్ కేసు ఇందూ టెక్ ఛార్జిషీటులో మరో నలుగురి పేర్లు


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ నిన్న ఇందూ టెక్ జోన్ పై ఛార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్, విజయసాయిరెడ్డి సహా మొత్తం 15 పేర్లను పేర్కొంది. తాజాగా ఇదే ఛార్జిషీట్ లో మరో నలుగురి పేర్లను ప్రస్తావించింది. ఏ11గా నిమ్మగడ్డ ప్రసాద్, ఏ12గా నిమ్మగడ్డకు చెందిన ఈ2 కార్పోరేట్ సర్వీసెస్, ఏ13గా ఇందూ శ్యాంప్రసాద్ కు చెందిన భైమి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్స్, ఏ14గా జగన్ కు చెంది కార్మెల్ ఏషియా, ఏ15గా ఇందూ గ్రూప్ ఛార్టర్డ్ అకౌంటెంట్ పీవీ కోటేశ్వరరావులను పేర్కొంది.

  • Loading...

More Telugu News