: మిస్ అమెరికాను విందుకు ఆహ్వానించాలి: మాజీ దౌత్యవేత్త


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని మన్మోహన్ సింగ్ లు మిస్ అమెరికా విజేత, ప్రవాస భారతీయురాలు నీనా దావులూరిని వైట్ హౌస్ లో జరిగే విందుకు ఆహ్వానిస్తారని ఆశిస్తున్నానని అమెరికా మాజీ దౌత్యవేత్త ఒకరు తెలిపారు. వాషింగ్టన్ లో ఆయన మాట్లాడుతూ.. ఒబామా, మన్మోహన్ భేటీ నేపథ్యంలో జరిగే విందుకు నీనాను కూడా ఆహ్వానిస్తే ప్రవాస భారతీయుల సేవలను రెండు దేశాలు గుర్తించినట్టు ఉంటుందని అన్నారు. గతంలో స్పెల్ బీ పోటీల్లో భారతీయ బుడతడు విజయం సాధించాడు. తాజాగా మిస్ అమెరికాగా ప్రవాసభారతీయురాలు నీనా దావులూరి కిరీటం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికన్ సమాజం భారతీయుల సేవలను గుర్తించాలని భావిస్తోంది. అందుకు సరైన గౌరవంగా నీనా దావులూరిని విందుకు ఆహ్వానిస్తే బావుంటుందని అనుకుంటున్నారు.

  • Loading...

More Telugu News