: విశాఖలో ప్రారంభంకానున్న బీచ్ కారిడార్ పనులు
విశాఖ మరింత శోభను సంతరించుకోనుంది. నగరానికి వన్నె తెచ్చే బీచ్ కారిడార్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఏపీ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ తెలిపారు. ఈ రోజు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది విశాఖ ఉత్సవాలను నిర్వహిస్తామని అన్నారు. బీచ్ కారిడార్ కోసం ఇప్పటికే రూ. 50 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని తెలిపారు. అంతేకాకుండా మరో రూ. 80 కోట్ల విలువైన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపామని చందనాఖాన్ తెలిపారు.