కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఎన్నికలు గురువారం జరగనున్నాయి. నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు నిర్వహించా
లని
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల డీసీసీబీ ఎన్నికలు జరిగినా ఫలితాల వెల్లడిలో గందరగోళం ఏర్పడింది. స్థానిక కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ముందుగానే, మేము గెలిచామంటే మేమేనని ప్రకటించుకోవడం సందిగ్ధతకు దారి తీసింది. అదే సమయంలో ఇద్ధరి మధ్య ఘర్షణ కూడా జరిగింది. చివరికి డీసీసీబీ ఛైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించే అధికారిని అపహరింఛి, ఆ తర్వాత ఆయనను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.