: టీవీ సిరీస్ పాత్రకు సోనియా గాంధీ ప్రేరణ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అత్యంత ప్రభావశీలత గల రాజకీయ నాయకురాలిగా.. సినిమాల్లో, టెలివిజన్ సిరీస్ లలో పాత్రలకు ప్రేరణగా నిలుస్తున్నారు. బాలీవుడ్ లో నటుడు అనిల్ కపూర్ తాజాగా '24' పేరుతో ఓ టీవీ సిరీస్ ను నిర్మిస్తూ, అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ కార్యక్రమం అమెరికన్ పాప్యులర్ టీవీ సిరీస్ కు రీమేక్. ఇందులో సీనియర్ హిందీ నటి అనితా రాజ్.. నైనా సింగానియా అనే పాత్ర చేస్తున్నారు. దీని గురించి ఆమె చెబుతూ..'నేను చేస్తున్న పాత్రకు సోనియాగాంధీయే ప్రేరణ. మంచి భావాలుగల మహిళ. తన కుమారుని కోసం ఎంతో కష్టపడుతున్న మహిళ' అని పేర్కొన్నారు. ఈ టీవీ సిరీస్ లో నటులు షబానా అజ్మీ, రాహుల్ ఖన్నా, ఇతరులు నటిస్తున్నారు.