: సచిన్ భవిష్యత్తును నిర్ణయించడానికి నేనెవర్ని?: సందీప్ పాటిల్


క్రికెట్ దేవుడు సచిన్ కెరీర్ కు తెరదించేందుకు తానెవ్వరినని చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ ప్రశ్నించారు. సచిన్ రిటైర్మెంట్ కోసమే విండీస్ తో రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ను బీసీసీఐ ఏర్పాటు చేసిందని మీడియాలో వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో... పాటిల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల తాను సచిన్ తో సమావేశమయ్యానన్న వార్తలను ఆయన ఖండించారు. సచిన్ ను తాను కలిసి దాదాపు పది నెలలు కావొస్తోందని... కనీసం ఆయనతో మాట్లాడలేదని చెప్పారు. ఏదేమైనప్పటికీ సచిన్ 200వ టెస్ట్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ పై ఓ నిర్ణయం తీసుకునే విధంగా బీసీసీఐ అడుగులేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News