: హైదరాబాదులో వర్షం.. నిమజ్జనానికి ఆటంకాలు
హైదరాబాదులో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు ఆటంకం కలిగింది. ఇక, ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు.