: ఇన్ఫోసిస్ కు మరో సీనియర్ అధికారి గుడ్ బై


భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కు సీనియర్ అధికారులు వరుసగా గుడ్ బై చెపుతున్నారు. ఆస్ట్రేలియాలో బీపీవో సేల్స్ హెడ్ గా పనిచేస్తున్న కార్తీక్ జయరామన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈయన 2006లో ఇన్ఫోసిస్ లో పదవీబాధ్యతలు స్వీకరించారు. ఇన్ఫోసిస్ కు రాంరాం చెప్పిన జయరామన్ మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా) లోని యాక్సెంచర్ లో చేరారు. దీనిపై స్పందించడానకి ఇన్ఫోసిస్ యాజమాన్యం నిరాకరించింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల రాక, పోకలకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేమని తెలిపింది.

ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా నారాయణమూర్తి తిరిగి పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత... సంస్థలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ఒక్కొక్కరే జారుకుంటున్నారు. ఈ నెల మొదట్లో లాటిన్ అమెరికా బీపీవో హెడ్ గా పని చేస్తున్న హంబర్టో యాండ్రేడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆగస్టులో అమెరికాలో ఆపరేషన్స్ హెడ్ గా పనిచేస్తున్న అశోక్ వేమూరి ఇన్ఫోసిస్ ను వదిలారు. జూలైలో గ్లోబల్ సేల్స్ హెడ్ బసబ్ ప్రధాన్ రిజైన్ చేశారు.

  • Loading...

More Telugu News