: ప్రజలు సహకరించాలి: ట్రాఫిక్ కమిషనర్
జంటనగరాల్లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ట్రాఫిక్ కమిషనర్ అమిత్ గార్గ్ తెలిపారు. మధ్యాహ్నం తరువాత నిమజ్జనం రద్దీగా మారుతుందని.. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ కు వెళ్లే రహదారుల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ లో 1500కు పైగా విగ్రహాలు నిమజ్జనమయ్యాయని అన్నారు. జంటనగరాల నుంచి హుస్సేన్ సాగర్ కు వచ్చే మంటపాల నిర్వాహకులు, ప్రజల కోసం అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆయన కోరారు.