: మేం కావాలో, శ్రీలంక కావాలో తేల్చుకోండి: కేంద్రానికి డీఎంకే అల్టిమేటం


యూపీఏ సర్కారుకు పలు అంశాల్లో బాసటగా నిలిచిన డీఎంకే పార్టీ నేడు వ్యతిరేక గళం వినిపించింది. కాంగ్రెస్ కు ప్రధాన మిత్రపక్షంగా పేరుపొందిన డీఎంకే తాజాగా 'శ్రీలంక యుద్ధ నేరాలు' అంశాన్ని తెరపైకి తెచ్చింది. తాము కావాలో, తమిళుల పట్ల దాష్టీకం చెలాయిస్తున్న శ్రీలంక కావాలో తేల్చుకోవాలని రాజ్యసభలో చర్చకు పట్టుబట్టింది.

డీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ ఈ రోజు సభలో ఎల్టీటీఈ ఛీఫ్ ప్రభాకరన్ చిన్న కుమారుడిని లంక దళాలు నిర్దాక్షిణ్యంగా చంపేసిన వైనాన్ని ఫొటోల ద్వారా ప్రదర్శించారు. 'లంకలో 2009లో జరిగిన మారణకాండ సందర్భంగా పిల్లలు వికలాంగులయ్యారు. స్త్రీలు ఏది కోల్పోకూడదో అదే కోల్పోయారు' అని ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సను భారత్ లో అడుగుపెట్టేందుకు అనుమతించవద్దని శివ హెచ్చరించారు. ఈ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు డీఎంకే... తన చిరకాల ప్రత్యర్థి అన్నాడీఎంకేతో కలిసి వాకౌట్ చేయడం రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేసింది.

  • Loading...

More Telugu News