: ట్యాంక్ బండ్ పై ఘర్షణ
ట్యాంక్ బండ్ పై గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఘర్షణ జరిగింది. ఎన్జీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనానికి వచ్చిన ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తమ వాహనం కంటే ముందెళ్లడమే కాకుండా మహిళలపై దాడికి పాల్పడ్డారంటూ ఒక వర్గంపై మరో వర్గం దాడికి దిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాగా, ఈ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఇంతలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకోవడంతో ఘర్షణకి తెరపడింది.