: సెల్ టవర్ పైకెక్కిన పొలిటికల్ జేఏసీ కన్వీనర్


విశాఖపట్నంలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపు దాల్చింది. సమైక్యవాదుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సీమాంధ్ర మంత్రుల రాజీనామాలు కోరుతూ విశాఖ రాజకీయ జేఏసీ కన్వీనర్ రామారావు సెల్ టవర్ పైకెక్కారు. మంత్రులు రాజీనామా చేస్తేనే కిందికి దిగుతానని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం గత 50 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించడంలేదంటూ మండిపడ్డారు. కిందికి దిగాలని పోలీసులు సూచించినా ఫలితం లేకపోవడంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం అతడిని కిందికి దించే ప్రయత్నాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News