: దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ అరెస్ట్
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దుగ్గిరాలలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులను చింతమనేని అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుని అడ్డుకున్న కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆయనను ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.