: జగన్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్
అక్రమాస్తుల కేసులో చంచల్ గూడ జైలులో సంవత్సరంపైగా రిమాండులో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు జగన్ కేసు దర్యాప్తు పూర్తి చేశామన్న సీబీఐ దర్యాప్తుకు కోర్టు నాలుగు నెలల సమయం ఇచ్చిందని తెలిపారు. అంతేకానీ, జగన్ బెయిల్ కు సుప్రీం పచ్చజెండా ఊపలేదని తెలిపింది. జగన్ చెప్పుకుంటున్నట్లు ఆయన నిరపరాధికాదని.. ఆయన నేరంపై ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది. ఈ క్రమంలో జైలు నుంచి బయటికి వస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ లో పేర్కొంది. ఈ కేసులో ఇంకా విచారణ జరగవలసి ఉందని అలాంటప్పుడు జగన్ కు బెయిల్ ఇవ్వటం సమంజసం కాదని పేర్కొంది. కాబట్టి, జగన్ బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని కోరింది.