: ఆహారమే ఔషధం


మనం రోజూ తీసుకునే ఆహారమే మనకు ఔషధం. ఒక సినిమాలో హీరో చెప్పినట్టు... ఆహారాన్ని మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం... అతిగా తీసుకుంటే రోగం... అలాగే మనం తీసుకునే ఆహారమే మనకు ఔషధంగా మారుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో... దాన్నిబట్టి మన ఆరోగ్యం ఉంటుంది. అయినా ప్రస్తుతం యువత ఎక్కువగా బర్గర్లు వంటి జంక్‌ ఫుడ్‌వైపే మొగ్గు చూపుతుంది. ఇలాంటి ఆహారమే మనలో ఒత్తిడికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మన శరీరానికి మేలు చేసే చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా పదికాలాల పాటు ఉంటామని పరిశోధకులు చెబుతున్నారు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకుని, కొవ్వు పదార్ధాల మోతాదు తక్కువగా ఉండేలా చూసుకుంటే చాలని మనం ఆరోగ్యంగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మారుతున్న జీవన విధానంలో ఒత్తిడి కూడా పెరిగిపోతోంది. ఈ ఒత్తిడిని అధిగమించాలంటే మన ఆహారంలో తగు మార్పులు చేసుకోవాలని, ఇందుకోసం పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు ఆహారంలో ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా జంక్‌ఫుడ్‌, ప్రాసెస్‌ చేసిన మాంసం తదితరమైన ఆహారపదార్ధాలతో ఒత్తిడి పెరుగుతుందని కూడా పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు. అలాగే సాస్‌లు వాడిన ఆహారం, తీపి పదార్ధాలు, ప్రాసెస్‌ చేసిన మాంసం వంటివి మనలోని ఒత్తిడి పెంచడానికి బాగా దోహదం చేస్తున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. కాబట్టి ఇలాంటి ఆహార పదార్ధాలను సాధ్యమైనంతవరకూ తగ్గించి, మన రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News