: కిడ్నీ క్యాన్సర్‌ను గుర్తించే బ్లడ్‌టెస్ట్
బ్లడ్‌టెస్ట్‌తో కిడ్నీ క్యాన్సర్‌ను గుర్తించవచ్చట. అలాంటి ఒక ప్రత్యేకమైన రోగ నిర్ధారణ మార్కర్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తంలో ఒక ప్రత్యేకమైన ప్రోటీను అధిక మోతాదులో ఉంటే సదరు వ్యక్తులకు కిడ్నీ క్యాన్సర్ ఉన్నట్టే. అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రోటీనును శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తంలో ఈ ప్రోటీను గుర్తింపుతో కిడ్నీక్యాన్సర్‌ను తేలికగా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రక్తంలో అధిక స్థాయిలో ఐసోసిట్రేట్ డీ హైడ్రోజెనేస్ (ఐడీహెచ్1) అనే ప్రోటీను అధిక మోతాదులో ఉన్నట్టయితే వారు మూత్రపిండాల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధితో బాధపడేవారి రక్తాన్ని పరీక్షించి ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తేల్చారు. మూత్రపిండాల క్యాన్సర్ ఉన్నవారి రక్తంలో ఈ ప్రోటీను అధిక స్థాయిలో ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదే మూత్రపిండాల వ్యాధికి సంబంధించి రోగ నిర్ధారణ మార్కర్‌గా తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.