: నోట్ ను వ్యతిరేకించేందుకే రాజీనామాలు చేయలేదు: పార్థసారథి


రాష్ట్ర శాసనసభలో తెలంగాణ నోట్ ప్రవేశపెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించడానికే తాము రాజీనామాలు చేయలేదని మంత్రి పార్థసారథి చెప్పారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం రుద్రపాకలో ఆయన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, సీడబ్ల్యూసీ నిర్ణయంపై అధిష్ఠానం పునరాలోచిస్తోందని తెలిపారు. ఇక విపక్షాలు సీఎం కిరణ్ పై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. సమైక్యాంధ్ర అవసరాన్ని కాంగ్రెస్ పెద్దలకు మొదట తెలియజేసిన వ్యక్తి ముఖ్యమంత్రే అని చెప్పారు.

  • Loading...

More Telugu News