: నిమజ్జనంలో విషాదం
మహబూబ్ నగర్ జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. నేడు నారాయణపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో గణేశ్ నిమజ్జనం యాత్ర నిర్వహించారు. యాత్ర కొనసాగుతుండగా స్పీకర్ బాక్సులు అమర్చిన ఆటోకు విద్యుత్ ప్రసారం జరిగింది. దీంతో, తిరుపతి (21) అనే యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతడిని నారాయణపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు.